తెలంగాణలో రోజుకు సరాసరి లక్ష కరోనా పరీక్షలు
తెలంగాణ | రాష్ట్రంలో ఈ ఏడాది మే 29వ తేదీ నుంచి రోజుకు సరాసరి లక్ష కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో పేర్కొన్నారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు నివేదిక సమర్పించారు. ఈ ఏడాది మే 29వ తేదీ నుంచి రోజుకు సరాసరి లక్ష కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 66,79,098 టీకా డోసులు ఇచ్చామన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పెషేంట్లు తగ్గుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36.50 శాతం, ప్రయివేటు ఆస్పత్రుల్లో 16.35 శాతం పడకలు నిండాయన్నారు.
కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,366 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిగతా 15 వేల పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో 132 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అనుమతిచ్చామన్నారు. నిలోఫర్ ఆస్పత్రిలో మరో వెయ్యి పడకలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల కోసం 4 వేల పడకలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సిబ్బంది పెంపు, శిక్షణకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

