అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి : ఆర్ కృష్ణయ్య
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1200మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మెహిదీపట్నం,అక్టోబర్15 : రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1200మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మాసాబ్ట్యాంక్ వద్ద ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద కాంట్రాక్ట్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. గతంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
గత ఏడాది ఏప్రిల్లో 11రోజులపాటు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు నిరవధిక సమ్మె చేయగా, సీఎం హామీతో సమ్మెను విరమింప చేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పటికీ సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, వైస్ ఛైర్మన్ పురుషోత్తం, సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్, సీ రాజేందర్, లింగం యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

