తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం
సోషల్ మీడియాలో చక్కర్లు నాగర్‌కర్నూల్‌లో సంచలనం
మహబూబ్‌నగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, ఆయన తండ్రి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి నియోజకవర్గంలోని నలుగురు కాంగ్రెస్ నేతల చేతిలో బందీ అయ్యారని పేర్కొంటూ విడుదల చేసి న కాంగ్రెస్ కార్యకర్తల కరపత్రం సంచలనం రేకెత్తిస్తున్నది. మహిళలపై అరాచకాలు, రైతు ల నోట్లో మట్టికొడుతున్న ఆ నలుగురికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంత పాడుతున్నారని వాపోయారు. నాలుగు పేజీల్లో తమ బాధ, అంతరంగాన్ని ఆవిష్కరించి రాసిన పత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కార్యకర్తలను ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి అవమానించారని వాపోయారు.
నలుగురులో ఒకడైన కృష్ణారెడ్డితో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండాపోయే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు గురించి చెప్పడానికి పదాలు, రాయడానికి కాగితాలు చాలవని నిప్పులు చెరిగారు. తాడూర్ మండలంలో వినోద్.. తెల్కపల్లి మండలంలో సుఖజీవన్‌రెడ్డి, కృష్ణారెడ్డి అరాచకం చేస్తున్నా.. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు నోరు మెదపని మండిపడ్డారు. కొణిదల రాము భూదందాలు చేసి కోట్లు పోగేశాడని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

