Munugode by Poll results | మునుగోడులో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్
Munugode by Poll results | మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కనీసం డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోయింది. 15 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించలేదు. మొదటి నుంచి చివరి రౌండ్
Munugode by Poll results | మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కనీసం డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోయింది. 15 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించలేదు. మొదటి నుంచి చివరి రౌండ్ వరకు మూడో స్థానంలోనే ఉండిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి.. కౌంటింగ్ కేంద్రం నుంచి ఉదయం 10 గంటల సమయంలోనే వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రం వైపు కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెత్తి కూడా చూడలేదు. డిపాజిట్ కూడా కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
డిపాజిట్ కోల్పోవడం అంటే..?
మునుగోడు ఉప ఎన్నికలో 2,41,805 ఓట్లకుగాను మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి. పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు వస్తే డిపాజిట్ దక్కినట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోయినట్లు. పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోవాలంటే 37,532 ఓట్లు రావాలి. కానీ అన్ని ఓట్లు రాలేదు. కేవలం 21 వేల పైచిలుకు ఓట్లే స్రవంతికి పోలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

