DS Funerals | అధికార లాంఛనాలతో నిజామాబాద్ లో డీఎస్ అంత్యక్రియలు..!
DS Funerals | మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ అంత్య క్రియలు ఆదివారం నిజామాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరిగాయి.
DS Funerals | మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ అంత్య క్రియలు ఆదివారం నిజామాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరిగాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో డీఎస్ అంత్య క్రియలు నిర్వహించారు. అంతకు ముందు నిజామాబాద్ ప్రగతి నగర్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్ ఇంటి నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. డీఎస్ అంతిమయాత్ర.. కంఠేశ్వర్, బైపాస్ రోడ్డు మీదుగా డీ శ్రీనివాస్ ఫామ్ హౌజ్కు చేరుకుంది. ఈ అంతిమ యాత్రలో డీఎస్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు రాజకీయ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన సొంతింట్లో డీఎస్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు నిజామాబాద్ లోని డీఎస్ సొంత వ్యవసాయ క్షేత్రంలో అధికార యంత్రాంగం ఆయన అంత్య క్రియలకు ఏర్పాట్లు చేసింది.
అంతకుముందు డీఎస్ నివాసంలో డీ శ్రీనివాస్ పార్ధివ దేహంపై సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా డీఎస్ సేవలందించారని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించిన నేత డీఎస్ అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను సంప్రదించి డీఎస్ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
విద్యార్థి నాయకుడు మొదలు అంచెలంచెలుగా ఎదిగి డీఎస్ ఉన్నత స్థాయికి చేరుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొంత కాలం పాటు పార్టీకి దూరమైనా పార్లమెంటులో డీఎస్ ను సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించే వారని గుర్తు చేశారు. తాను చనిపోయినప్పుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పాలన్న డీఎస్ చివరి కోరికను నెరవేర్చేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి డీ శ్రీధర్ బాబును పంపి నెరవేర్చామన్నారు.
ఇవి కూడా చదవండి :
Oppo Reno 12F 5G | ఒప్పో ప్రీమియం ఫోన్ ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
World Bank | గ్రీన్ ఎనర్జీ కోసం భారత్కు ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

