Rajeev Yuva Vikasam | యువ వికాసం డబ్బులు ఇప్పట్లో లేనట్టే.. స్థానిక ఎన్నికల్లో గెలిస్తే చూద్దామంటున్న సర్కారు!
Rajeev Yuva Vikasam | దరఖాస్తులు కొండంత.. యూనిట్లు గోరంత.. అందులోనూ కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం! వెరసి యువత నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ముందు ఎందుకీ గొడవ? అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువవికాసం పథకాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టింది.
- అనర్హులను ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు
- ముందుకెళ్తే నష్టమని సర్కారు యోచన
- పంచాయతీ పోరు తర్వాతే ఇవ్వాలని నిర్ణయం
- అదీ గ్రామసభల్లోనే ఎంపిక..
- సిబిల్ స్కోర్‌కే బ్యాంకర్ల ప్రాధాన్యం
- తలలు పట్టుకుంటున్న అధికార యంత్రాంగం
Rajeev Yuva Vikasam | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): దరఖాస్తులు కొండంత.. యూనిట్లు గోరంత.. అందులోనూ కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం! వెరసి యువత నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ముందు ఎందుకీ గొడవ? అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువవికాసం పథకాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టింది. లబ్ధిదారుల ఎంపికను ఎక్కడికక్కడ నిలిపేసింది. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత, లబ్ధిదారులను గ్రామసభల్లోనే ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ యువవికాసం పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన 16,27,584 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం 4,93,234 యూనిట్లను మంజూరు చేసింది. తొలిదశలో రూ.50 వేలలోపు యూనిట్లతో మొదలుపెట్టి చివరగా రూ.4 లక్షల యూనిట్లను అందివ్వాలని భావించింది. వాస్తవానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బ్యాంకులు సిబిల్స్కోర్కే ప్రాధాన్యం ఇవ్వడం, స్థానిక నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలని పట్టుబట్టడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది.
యువత వ్యతిరేకతతో వెనుకడుగు
రాజీవ్ యువ వికాసం పథకం కింద యువతకు రుణాలను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. గరిష్ఠంగా 60 ఏండ్ల వయసు వారికీ అవకాశం కల్పించింది. దీనిని యువత తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు, ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు అనేక షరతులు పెట్టింది. దీనికితోడు ఎమ్మెల్యేలు చెప్పినవారినే ఎంపిక చేస్తున్నారని, పైరవీలకు, కాంగ్రెస్ కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పూర్తి పారద్శకంగా ఎంపిక చేసేందుకే ఈ పథకాన్ని వాయిదా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. రాజీవ్ యువ వికాసం కోసం 16,27,584 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 50 శాతానికిపైగా రూ.4లక్షల యూనిట్లకు సంబంధించినవే ఉన్నాయి. దళితబంధు, బీసీబంధు, ట్రైకార్ రుణాలకు గతంలోనే దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నవారు మరో 10 లక్షల మందికిపైగా ఉంటారు. వారందరికీ రుణాలు ఇవ్వలేని పరిస్థితి. ఒకరికి ఇస్తే పది మంది తిరగబడతారనే భయం సర్కారుకూ పట్టుకున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన తరువాతనే దీనిపై ముందుకుపోవాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు ఉన్నతాధికారులు, పార్టీ వర్గాలూ వెల్లడిస్తున్నాయి.
గ్రామసభల్లో సరే.. ఎంపిక ఎలా?
యువత నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అయితే గ్రామసభల్లో ఎంపిక ప్రక్రియను ఎలాచేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే, ఈ పథకం కింద రూ.50 వేల యూనిట్ మినహా మిగిలిన యూనిట్లన్నీ బ్యాంకు లింకేజీ రుణలే. ప్రభుత్వ సబ్సిడీపోగా మిగతా మొత్తాన్ని బ్యాంకులే రుణంగా మంజూరు చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల సిబిల్‌స్కోర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు ఉన్న వారినే బ్యాంకులు ఎంపికచేస్తున్నాయి. కానీ, స్థానిక కాంగ్రెస్ నేతలు తాము చెప్పిన వారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగని పరిస్థితి నెలకొన్నది. గ్రామసభల్లో ఎంపిక అంటే రాజకీయ జోక్యం మరీ ఎక్కువవుతుందని, అది ఇంకా కష్టమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

