కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.
ఢిల్లీ, అక్టోబర్ 8: పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సుదీర్ఘంగా పెండింగులో ఉన్న పలు అంశాలను పరిష్కారించాలని సీఎం కోరారు.
ఆ రెండు రాష్ట్రాల్లో పోలవరం నిర్మాణంలో భాగంగా చేపట్టాల్సిన ప్రొటెక్టివ్ ఎంబాంక్మెంట్స్ పనులకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందనే కారణంతో అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్ ప్రస్తుతం అబెయన్సులో ఉన్నప్పటికీ… దాన్ని శాశ్వతంగా ఉపసంహరించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఒప్పంచాలని కోరారు. ఈ మేరకు కేంద్ర జల మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను త్వరితగతిన చేపడుతున్నట్టు కేంద్ర మంత్రికి తెలిపారు. గోదావరి నది నుంచి వేల టీఎంసీల వరద జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయని.. ఆ నీటిని సద్వినియోగం చేసుకునేలా పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను కూడా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

