సివిల్ సర్వీస్ గౌరవాన్ని మంటగలిపే యత్నం
సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఉండొద్దన్న సీనియర్ ఐఏఎస్ స్మితాసబర్వాల్ అభిప్రాయాన్ని సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు బాలలత ఒక ప్రకటనలో ఖండించారు.
- సివిల్స్ కోచింగ్ నిర్వాహకురాలు బాలలత
- సబర్వాల్ వ్యాఖ్యలకు వికలాంగుల సంఘాల నాయకుల ఖండన
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఉండొద్దన్న సీనియర్ ఐఏఎస్ స్మితాసబర్వాల్ అభిప్రాయాన్ని సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు బాలలత ఒక ప్రకటనలో ఖండించారు. ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడంతోపాటు ఆలిండియా సర్వీసెస్ పట్ల ఉన్న గౌరవాన్ని మంటగలిపే ప్రయత్నంగా పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారులకు సరైన పనిచెప్తే, ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉంటారని, లేనప్పుడే ఇలాంటి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు.
ఇటీవల బ్యూరోక్రాట్లకు పనిలేకుండా పోయింది’ అని పేర్కొన్నారు. ఈ అంశంపై సోమవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి అడివయ్య, అధ్యక్షుడు వెంకట్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఆమెపై 2016 ఆర్పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దివ్యాంగులను కించపరిచేలా ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానించడమేనని దివ్యాంగుల సలహాదారుల బోర్డు మెంబర్ నర్రా నాగేశ్వర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్‌గా ఆమె అనర్హురాలని, ఆమెపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

