నాడు… నేడు…
వాగులు, వంకల ద్వారా వృథాగా ప్రవహిస్తున్న నీటిని ఒడిసి పట్టుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం చెక్‌డ్యాంల నిర్మాణాన్ని చేపట్టింది. 2020-21లో మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా రూ.58.25 కోట్లు వెచ్చించి 21 చోట్ల చెక్ డ్యాంలను నిర్మించింది.
- నిండుగా నీటితో చిట్యాల చెక్‌డ్యాం కళకళ
- నీళ్లు లేక బోసిపోయిన చిట్యాల చెక్‌డ్యాం
వాగులు, వంకల ద్వారా వృథాగా ప్రవహిస్తున్న నీటిని ఒడిసి పట్టుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం చెక్‌డ్యాంల నిర్మాణాన్ని చేపట్టింది. 2020-21లో మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా రూ.58.25 కోట్లు వెచ్చించి 21 చోట్ల చెక్ డ్యాంలను నిర్మించింది. ఇందులో భాగంగా నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామం వద్ద కూడా 2021లో స్వర్ణ వాగుపై రూ.4.50 కోట్లతో చెక్‌డ్యాంను నిర్మించారు. దీంతో ఇక్కడి వాగులో దాదాపు కిలోమీటరు మేర మండు వేసవిలో కూడా నీరు నిలిచి ఉండేది. వాగుకు ఇరువైపులా ఉన్న వ్యవసాయ భూముల్లో రెండు పంటలకు ఢోకా లేకుండా పోయింది. చెక్‌డ్యాం నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి, ఎత్తిపోయిన బోరుబావుల్లో నీరు ఉబికి వచ్చింది.
ఈ సారి వేసవికి ముందే వాగు పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నది. వాగుకు ఇరువైపులా సాగు చేసుకుంటున్న రైతులకు శాపంగా మారింది. చెక్‌డ్యాం నిర్మించిన నాటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని వాగు ఒడ్డునే పంటలు సాగు చేస్తున్న చిట్యాల గ్రామానికి చెందిన రైతు సంతోష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పదెకరాల భూమిలో నాలుగెకరాలు వరి, ఆరెకరాల్లో మక్క సాగు చేశానని, ఈ సారి వరి చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోయాడు. -నిర్మల్, మార్చి 11(నమస్తే తెలంగాణ)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

