ఓట్ల తొలగింపుపై విచారించండి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించడం, జాబితాలో తప్పులపై వచ్చిన ఫిర్యాదులపై సీఈవో కార్యాలయం స్పందించింది. ఈ మేరకు సమగ్ర విచారణ జరుపాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారికి బుధవారం ఆదేశాలు జారీచేసింది. ప్రగతిశీల సమాజ్ పార్టీ (పీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ ఖాదర్ ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు, అర్హులైన ఓటర్ల తొలగింపుపై ఈసీఐ పీజీఆర్ఎస్ సెల్‌కు ఫిర్యాదు చేశారు.
- మహబూబ్‌నగర్ కలెక్టర్‌కు సీఈవో ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించడం, జాబితాలో తప్పులపై వచ్చిన ఫిర్యాదులపై సీఈవో కార్యాలయం స్పందించింది. ఈ మేరకు సమగ్ర విచారణ జరుపాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారికి బుధవారం ఆదేశాలు జారీచేసింది. ప్రగతిశీల సమాజ్ పార్టీ (పీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ ఖాదర్ ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు, అర్హులైన ఓటర్ల తొలగింపుపై ఈసీఐ పీజీఆర్ఎస్ సెల్‌కు ఫిర్యాదు చేశారు.
దీనిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం, తగిన చర్యలు తీసుకోవాలని సీఈవో కార్యాలయానికి సూచనలు చేసింది. దీంతో సీఈఐ నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి ఈ అంశంపై సమగ్ర విచారణ జరుపాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి మహబూబ్‌నగర్ డీఈవోకు ఆదేశాలు జారీచేశారు. విచారణ వివరాలను ఫిర్యాదుదారునికి తెలియజేయడంతోపాటు, తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

