హైదరాబాద్, సిటీబ్యూరో, నవంబర్ 3(నమస్తే తెలంగాణ) : ‘కేజ్రీవాల్ రైట్హ్యాండే. మా వెంట ఉన్నడు. వాడి వెంట ఉన్న శక్తులు అందరినీ పట్టేశాం. అక్కడి గవర్నర్ నా శిష్యుడే. కర్ణాటకలో 16 మందితో గవర్నమెంట్‌ను కొలాప్స్ చేసినం. మేం కర్ణాటక ఆపరేట్ చేసినప్పుడు కూడా.. డైరెక్ట్‌గా చెన్నై..చెన్నై టు ఇండిగోలో ముంబై…ఆఫ్టర్ రీచ్ టు ముంబై అక్కడ అన్నీ డెలివరీ చేసినం. అంతటా ఇలాంటి ప్రొసీజరే ఫాలో అవుతుంటం. కర్ణాటక చేసినప్పుడు పంచెలు, రుమాలు కట్టుకొని..గడ్డపారలు పట్టుకొని ట్రాక్టర్ ఎక్కి కూలీల్లాగ ఎమ్మెల్యేలు ఫాంహౌస్‌కు వెళ్లిర్రు తెలుసా.. ఆ తర్వాత వోల్వో బస్సు ఎక్కించినం. ఫిఫ్టీ పర్సంటేజ్ వాళ్లు చేస్తరు. మొత్తం సంతోష్‌నే చక్రం తిప్పుతడు. అమిత్ షా సింగిల్ ప్లే..తుషార్ పాత్ర వేరే.. సంతోశ్ పాత్ర వేరే.. అమిత్‌షాతో మాట్లాడాకే సంతోష్ ఒక నిర్ణయానికి వస్తాడు.’
రామచంద్ర భారతి : సంతోష్ అమిత్‌షాను రిక్వెస్ట్ చేశారు. అక్కడ సింగిల్ ప్లే…తుషార్ది వేరే పాత్ర. అతని ఫోన్ కంటిన్యూగా ఎంగేజ్ వస్తున్నది. అక్కడ పేమెంట్‌కు సంబంధించి ఎలాంటి ఇష్యూ లేదు. ఇంతకుముందే ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. అది నంద కుమార్ ముందే మ్యాటర్ సెట్ అయ్యింది. ఈ రోజే వచ్చిన.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : మేం మునుగోడు ఎలక్షన్స్‌లో ఉన్నాం.
భారతి స్వామి : అందుకోసమే ఇక్కడకు వచ్చిన. మిమ్మల్ని కలుద్దామని. పేర్లు పంపకండి. నేరుగా వాళ్ల ముందుకొచ్చి కలుస్తా అని…ఏదైనా పొరబాటు జరిగి ఇంటెలిజెన్స్‌కు తెలిస్తే మీరు చిక్కుల్లో ఉంటారని నేరుగా వచ్చా. ఒకరోజు అటు ఇటు జరగొచ్చు. ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని ఉద్దేశం. (పక్కనే నందకుమార్‌తో మాట్లాడుతూ) ఎన్ని గంటలకు ఫ్రీ అవుతారని వారిద్దరు అడుగుతున్నరు.
నందకుమార్ : సాయంత్రం 6.15 అవుతుంది. (మధ్యలో భారతి స్వామి కల్పించుకుంటూ) 5.45కి కాన్ఫరెన్స్ అయిపోయింది.
రోహిత్‌రెడ్డి: స్వామిజీ ప్రాసెస్ ఏంది. ఎట్లుంటది. వీళ్లు అడుగుతున్నరు. నేను వీళ్లకు స్వామిజీయే డైరెక్ట్‌గా చెబుతారని చెప్పిన.
భారతి స్వామి : వాళ్లకు కొన్ని కండీషన్లు ఉంటయి. వీళ్లకు కొన్ని కండీషన్లు ఉంటయి. ఎవరికి ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి అని ఉంటయి. నేను ఒక్కణ్ణే కానీ..(అంతలో స్వామీజీ ఫోన్ రింగ్ అయ్యింది) తుషార్జీ.. ఇక్కడ రోహిత్‌రెడ్డి ఉన్నాడు. మేం ఇక్కడ డిస్కస్ చేస్తున్నం. వారు సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నరు. నేను ఫోన్ రోహిత్‌రెడ్డికి ఇస్తాను. ఆయనతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి ఫైనలైజ్ చేసి డిస్కషన్ చేసినం. వారు కూడా తొందరగానే ఉన్నరు. స్టేట్ ఇష్యూ గురించి, పేమెంట్ విషయం ఒక్కటే ఉంది. అంటూ ఫోన్ రోహిత్‌రెడ్డికి ఇచ్చాడు. తుషార్జీ గుడ్ ఈవినింగ్..ఎలా ఉన్నారు?
తుషార్ : స్పీకర్ ఆన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ..రేపట్నుంచి మీరు ఎప్పుడైనా చేరడానికి సిద్ధంగా ఉన్నారు కదా. నేను సంతోశ్‌తో మాట్లాడి ఎంత త్వరగా అయితే అంత తొందరగా చేద్దాం. మీరు ఫ్రీగా ఉన్నారా..
రోహిత్‌రెడ్డి : వాస్తవంగా మేము మునుగోడు ఎన్నికల్లో ఉన్నాం.
తుషార్: ఆ ఆ..మునుగోడు ఎలక్షన్స్ థర్డ్ ఉన్నాయి కదా. థర్డ్ ఆర్ ఫోర్త్ కలుద్దాం.
(పక్కనే ఉన్న నందకుమార్ సైగలు చేస్తూ వద్దు వద్దు అంటూ రోహిత్‌రెడ్డిని చేతి ఊపుతూ వారించారు)
రోహిత్‌రెడ్డి : ఈ రోజు కానీ..రేపు కానీ..మేము ఎందుకంటే..మళ్లీ స్వామిజీ చెప్పారు. మొత్తం ఈ రోజే ఫినిష్ చేస్తా అన్నరు. నా తోపాటు నా కొలీగ్స్ ముగ్గురు ఇక్కడకు వచ్చారు.
తుషార్: మేము సంతోష్‌తో కలుస్తాము. ఆయనతో కన్ఫర్మేషన్ తీసుకోవాలి. దీనికి ముందు ఒకసారి మనం కలుద్దాం. కావాల్సి వస్తే కలిసే వెళ్దాం.
రోహిత్‌రెడ్డి: ఒక పనిచేద్దాం తుషార్జీ. ఈ రోజు రాత్రి వరకు మీరు హైదరాబాద్‌కు రాగలిగితే..ఇది రిస్క్‌తో కూడుకొన్న పని. చాలా డేంజరస్ సిచ్యుయేషన్.
తుషార్జీ : మనం కలుద్దాం. ఫైనల్ డిస్కషన్లో అందరం కలుసుకొందాం. భారతీ స్వామి ఫోన్ తీసుకొని..వాళ్లు టెన్షన్ పడుతున్నరు. ఇంటెలిజెన్స్ నిఘా ఉంది.
ఎమ్మెల్యేలు: స్వామిజీ ఫిగర్ డైరెక్ట్‌గా చెప్పండి.
భారతీ స్వామీ(తుషార్‌తో ఫోన్లో): టోటల్ ఫోర్ మెంబర్స్. టూ టూ ఫైవ్.
ఎమ్మెల్యేలు : ఫిఫ్టీ పర్సంటేజ్ భారతీస్వామి తల ఊపుతూ ఫోన్లో తుషార్‌తో కొద్దిసేపు మలయాళంలో ఏదో మాట్లాడారు. చివరగా భారతి స్వామీ ఫోన్లైన్లో మాట్లాడుతూ.. ఫిగర్ ఈజ్ క్లియర్.
రోహిత్‌రెడ్డి : ఈ రోజు పాసిబుల్ కాదా ?
భారతి స్వామి: ఈ రోజే అనుకున్నం. కానీ సంతోష్‌కు అమిత్‌షా టచ్‌లోకి రాలేదట. సంతోశ్ నుంచి ఫోన్ రాలేదు. అమౌంట్ విషయంలో మనం క్లియర్.
రోహిత్‌రెడ్డి : సరే వెయిట్ చేద్దాం..అంతేగా స్వామిజీ
సింహయాజి : స్వామిజీ..వీళ్లు చాలా తొందరలో ఉన్నరు.
బాలరాజు: సంతోష్‌తోపాటు ఇతరులతో మాకు టైం ఇప్పించడానికి సమయం పట్టొచ్చు.
రోహిత్‌రెడ్డి : అంతేకదా స్వామీజీ వెయిట్ చేస్తే పోదా..
నందకుమార్ : అన్నా వాళ్లు ఆఫీస్‌లో లేరు.
రోహిత్‌రెడ్డి : అన్నా..అపాయింట్మెంట్ తర్వాత తీసుకుందాం. ఈ రోజు ఫిఫ్టీ పర్సంటేజ్ ముట్టాలె. ఈడికెళ్లి జంప్..
బాలరాజు : మేం ప్రచారం వదిలేసి వచ్చినం. మా గురించి డ్రైవర్లను అడుగుతరు.
రోహిత్‌రెడ్డి: స్వామిజీ అతను చెప్పేది అర్థం అవుతున్నదా..రెండు,మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నం.
భారతి స్వామీ : మీకున్న ఒత్తిడి నాకు అర్థమైంది. నేను నాలుగు రోజుల ముందే రావాలనుకున్న. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల రాలేదు. ఈ రోజు కూడా నేను ఆరోగ్యంగా లేను. దీనికోసం నేను కూడా ఢిల్లీ వాళ్ల కోసం వెయిట్ చేస్తున్న.
రోహిత్‌రెడ్డి : నీకేం ఇంజక్షన్ కావాలో చెప్పండి తెప్పిద్దాం..
భారతి స్వామి : నాకు ఢిల్లీలో డాక్టర్ చూస్తున్నడు. ఎప్పుడైనా అక్కడకు వెళ్తాను.
రోహిత్‌రెడ్డి : ఇప్పుడు ఢిల్లీని కూడా స్వామినే ఆపరేట్ చేస్తున్నారట.. నెక్ట్స్ వీక్‌లో ఖతమట.
భారతి స్వామి : అది సమ్‌థింగ్ డిఫరెన్స్..
సింహయాజి : వన్స్ ప్రొగ్రెస్ స్ట్రార్ట్ అయిందంటే ఫినిష్ అయిపోతుంది.
బాలరాజు : అక్కడ ఎవరి ద్వారా అవుతుంది ?
భారతి స్వామి : మేం ఫస్ట్ టైం ఇట్ల చేస్తున్నం. ఫిఫ్టి పర్సంటేజ్ వాళ్లు చేస్తరు. మొత్తం సంతోశ్నే చక్రం తిప్పుతడు. మావాళ్లు ఒక్కొక్కరిని కనెక్ట్ చేసుకుంట వస్తరు. అందుకే ఇట్ల నడుస్తుంది. మేం బయటకు రావడం ఇది మొదటిసారి.
బాలరాజు : ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీని ఎవరు హ్యాండిల్ చేస్తున్నరు?
రామచంద్ర భారతి : సంతోష్ సార్.
బాలరాజు : ఎంతమంది ఉంటరు ?
భారతి స్వామి : థర్టీ సిక్స్
సింహయాజి : స్వామిజీ..అక్కడ గవర్నర్ నా శిష్యుడు.(నవ్వులు). మధ్యలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ టీ తాగుదాం.
ఎమ్మెల్యేలు : ఢిల్లీది ఏంది ?
భారతి స్వామి, సింహయాజి : ఢిల్లీ ఇంటెలిజెన్స్ అంతా సెంట్రల్ చేతిలో ఉంటది. ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఒక్క పైసా ఇవ్వలేదు. వాళ్లకు పవర్ కావాలి. అందులో మెయిన్ క్యాండెట్ సీఎం అవుతాడు. మధ్యలో భారతి స్వామి జోక్యం చేసుకొంటూ నోనో..బీజేపీ నుంచి సీఎం అవుతరు..ఆప్ నుంచి డిఫ్యూటీ సీఎం అవుతరు. ఆల్రెడీ చర్చలు కూడా అయిపోయినయి.
భారతి స్వామి : పార్టీలు వేరు. హ్యుమానిటీ..ట్రస్ట్ ఇంపార్టెంట్. బీజేపీ అన్ని యాంగిల్లో రెస్పెక్ట్ ఇస్తది. హ్యాపీ యా?
బాలరాజు : ఎస్..హ్యాపీ..ఎమ్మెల్యేను అయిన హ్యాపీ..
రోహిత్‌రెడ్డి : (బాలరాజును చూపిస్తూ..) ఇతను అసంతృప్తిగా ఉన్నడు..మినిస్టర్ కావాలని కోరిక ఉంది. అందుకే కలుస్తున్నడు.
భారతి స్వామి : కర్ణాటకలో 16 మందితో గవర్నమెంట్‌ను కొలాప్స్ చేసినం. మా ఎమ్మెల్యేల కన్నా వాళ్లకే ప్రాధాన్యమిచ్చాం. నీకు కూడా మినిస్టర్ తప్పకుండా వస్తది.
భారతి స్వామి : మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి.
బాలరాజు : ప్రభుత్వాలు కూలగొట్టడంలో బీజేపీ ఎజెండా ఏంది ? ఆ తర్వాత కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటది ?
భారతి స్వామి : నో..నో..నో. బీజేపీ దాని ఎజెండా దానికుంటుంది. నేను ఇంటర్ఫియర్ కాను. అన్నింట్లో ఇన్వాల్వ్ అయితే యూజ్ లేదు. అడ్మినిస్ట్రేషన్ వాళ్లే చూసుకుంటరు.