వివాహిత గొంతుకోసి దారుణ హత్య
వివాహిత గొంతు కోసి దారుణంగా హతమార్చిన సం ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకొన్నది.
- చందానగర్ పోలీసుల అదుపులో నిందితుడు?
కొండాపూర్, జూన్ 14 : వివాహిత గొంతు కోసి దారుణంగా హతమార్చిన సం ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకొన్నది. సీఐ పాలవెల్లి తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక సే డం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి (32) తన కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వచ్చి.. నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ -1లో నివాసముంటున్నది. స్థానిక అపర్ణ టవర్స్‌లో వంట మనిషిగా పని చేస్తున్నది. విజయలక్ష్మీ సోదరుడు సునీల్.. ఆటోడ్రైవర్ భరత్ అలియాస్ శ్రీనివాస్ గౌడ్ దగ్గరి నుంచి ఫైనాన్స్ కింద కొంత నగదు తీసుకొన్నాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగి పోలీ సు కేసు వరకు వెళ్ళగా, ఇటీవలే లోక్ అదాలత్‌లో కేసును ఉపసంహరించుకొన్నట్టు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం విజయలక్ష్మి ఇంట్లోకి శ్రీనివాస్‌గౌడ్ చొరబడి కత్తితో ఆమెను గొంతును గాయపరిచి, దారుణహత్య చేశాడు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలా… వివాహిత సంబంధంతో హత్యకు దారితీసిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. కాగా హంతకుడు శ్రీనివాస్‌గౌడ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

