రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
రేవంత్ సర్కార్‌లో స్కీమ్‌లు లేవని అన్నీ స్కామ్‌లే ఉన్నాయని, ఆఖరికి కార్మికుల సొమ్మును కూడా వదల్లేదని బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
- కార్మికులకు బీఆర్ఎస్ అండ: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
చిక్కడపల్లి, అక్టోబర్ 16 : రేవంత్ సర్కార్‌లో స్కీమ్‌లు లేవని అన్నీ స్కామ్‌లే ఉన్నాయని, ఆఖరికి కార్మికుల సొమ్మును కూడా వదల్లేదని బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం బీఆర్ఎస్ కార్మిక విభాగం బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మికశాఖ భవనం ఎదుట మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతున్నదని, కుంభకోణాలకు నిలయంగా మారిందని విమర్శించారు.
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం, వారి ప్రయోజనాలు విస్మరించి నిధులు దారిమళ్లీస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికశాఖలో రూ. 150 కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై చర్చకు మేము ఎక్కడికైనా సిద్ధమని, సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా? అని సవాల్ విసిరారు. భవనరంగ కార్మికులకు కనీసం ఇన్సూరెన్స్ కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని, దీంతో సుమారు 15 లక్షల మంది కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. పక్క రాష్ట్రంలో కార్మికులకు డైరెక్ట్ క్లెయిమ్ అవుతుందని, తెలంగాణలో మాత్రం దళారీ వ్యవస్థ కొనసాగుతున్నదని విమర్శించారు.
కార్మికశాఖలో రేవంత్ రెడ్డి సోదరులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కార్మికశాఖలో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీర్టీయూ అనుబంధ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ నారాయణ, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి వీ మారయ్య, నాయకులు ప్రభాకర్, సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి, మహేశ్, సాయి, రాజు, రామాంజనేయులు, కిషన్, గణేశ్, హరీశ్, పాండు, రామకృష్ణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namaste effect | గౌతమ్‌పూర్ గ్రామంలో చేతిపంపునకు మరమ్మతులు
Dhirendra Shastri: కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై క్రిమినల్ కేసు
Theft cases | ఖిల్లా ఘనపూర్ మండలంలో వరుస దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు
Pawan Kalyan | సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ దూరం.. ఫ్యాన్స్‌లో చిన్న నిరాశ, పెళ్లికైన వస్తారా?
Common Pass | కామన్ పాస్ ధరలు తగ్గించిన ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

