KTR | హైదరాబాద్ : అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా రేపు 9 నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయడంలో భాగంగా సోమవారం నాడు ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, ఆందోలు, జగిత్యాల, జుక్కల్, వర్దన్నపేట, చేవేళ్ల, పరిగి నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. వీటిలో చేవేళ్ల, పరిగి నియోజకవర్గాల సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు.
సోమవారం ఉదయం 11 గంటలకు చేవేళ్లలోని కేజీఆర్ గార్డెన్లో జరిగే సమావేశానికి కేటీఆర్ హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పరిగిలోని ఎస్ గార్డెన్లో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.