KTR | నందిని సిధారెడ్డి తెగువ.. తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఓ మైలురాయి : కేటీఆర్
KTR | తెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
KTR | తెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నగదు పారితోషకం, ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో సిధారెడ్డి చూపిన నిబద్ధత, తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుంన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్ణయంపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అల్వాల్‌లోని నివాసంలో జరిగిన సమావేశంలో కేటీఆర్, సిధారెడ్డితో ఉద్యమకాల స్మృతులను నెమరేసుకున్నారు. ప్రభుత్వమే తెలంగాణ అస్థిత్వంపై కుట్రలు చేస్తున్న ఈ తరుణంలో తెలంగాణ సమాజానికి నందిని సిధారెడ్డి గట్టి సందేశం పంపారన్నారు.
తెలంగాణ బిడ్డలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా వెనుకాడరనే.. సిధారెడ్డి ఈ ధైర్యవంతమైన నిర్ణయం సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. సమావేశంలో తెలంగాణపై ప్రస్తుతం జరుగుతున్న అస్థిత్వ దాడులపై చర్చ జరిగింది. ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ హక్కులను రక్షించుకోవాల్సిన, అవసరం ఉందని, తెలంగాణ సమాజం మరోసారి ఐక్యంగా పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో కవులు, కళాకారులు ఎప్పుడూ ముందుంటారని కేటీఆర్ అన్నారు. నందిని సిధారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. నందిని సిద్ధారెడ్డి తాను రాసిన కొన్ని పుస్తకాలను కేటీఆర్‌కు అందించారు. సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్, దేవి ప్రసాద్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.
తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బుధవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
🔺నందిని సిధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వజూపిన రూ. 1 కోటి నగదు పారితోషికం మరియు ప్లాట్‌ను తిరస్కరించడం… pic.twitter.com/cnHXuBPkmc
— BRS Party (@BRSparty) December 14, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

