BRS | బీజేపీకి షాక్.. బీఆర్ఎస్లో చేరిన బీజేపీ రాష్ట్ర నాయకుడు, కౌన్సిలర్లు
BRS | బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు.
నిర్మల్ : బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. బుధవారం దివ్యా గార్డెన్ లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) సమక్షంలో బీఆర్ఎస్ ( BRS )లో చేరారు. ఈ సందర్భంగా ఆయన గులాబీ కండువా కప్పి అప్పాల గణేష్,వార్డు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు ఆయన అనుచరులను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అంతకుముందు బైల్ బజార్ నుంచి దివ్యా గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి (Development), సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. మహారాష్ట్ర ( Maharastra ), మధ్యప్రదేశ్ ( MadyaPradesh ) తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు.
మరోవైపు కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని వెల్లడించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ లాంటి వారు సొంత పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. సమష్టిగా పని చేసి నిర్మల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, ,నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారు..
బీఆర్ఎస్ లో చేరిన వారిలో అప్పాల గణేష్ తో పాటు కౌన్సిలర్లు కత్తి నరేందర్, సైండ్ల శ్రీధర్, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల రవి, తోట నర్సయ్య, గోపు గోపి, నేల అరుణ్ కుమార్, సాకీర్, అలీం, అప్పాల ప్రభాకర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువకులు, కులసంఘాల నేతలు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP Leaders
- BRS
- Councilors
- join
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

