రేవంత్.. రాజీనామా చెయ్
కండ్లముందట గోదావరి ఆంధ్రాకు తరలిపోతున్నా.. నీళ్లెత్తక రాష్ట్ర రైతులను కరువు కోరల్లోకి నెట్టిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం ఆగ్రహం వ్యక్తంచేసింది.
- నీళ్లివ్వ చేతగాకుంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపో
- కన్నెపల్లి పంప్‌లు ఆన్ చేయకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తం
- కరువు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
- కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించిన హైదరాబాద్ నేతలు
- నీళ్లను వదిలేసి ప్రజలను ఇబ్బందులు పెడ్తరా అంటూ నిప్పులు
- అసమర్థ పాలన వల్లే మళ్లీ బస్తీలకు ట్యాంకర్లు : కేపీ వివేకానంద
- కేసీఆర్‌కు పేరొస్తుందనే సర్కార్ కుట్ర : మర్రి రాజశేఖర్‌రెడ్డి
- ఇక్కడ ఇడిసిపెడ్తే.. అక్కడ బాబు ఒడిసిపడ్తున్నడు : సుధీర్‌రెడ్డి
- సీఎం చేతగానితనం వల్లే రాష్ట్రంలో కరువు : ఎర్రబెల్లి
- కాంగ్రెస్ వైఫల్యం వల్లే జల మాఫియా : గండ్ర వెంకటరమణారెడ్డి
కండ్లముందట గోదావరి ఆంధ్రాకు తరలిపోతున్నా.. నీళ్లెత్తక రాష్ట్ర రైతులను కరువు కోరల్లోకి నెట్టిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం ఆగ్రహం వ్యక్తంచేసింది. కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి తెలంగాణను సాగు, తాగునీటి సంక్షోభంలో పడేసిందని నిప్పులు చెరిగింది. హైదరాబాద్‌వాసులను తాగునీటి గండం నుంచి గట్టెక్కించేందుకు వెంటనే కన్నెపల్లి పంపులను నడిపి గోదావరి జలాలను ఎత్తిపోయాలని డిమాండ్ చేసింది.
తక్షణ చర్యలు చేపట్టకుంటే ప్రజలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బరాజ్‌ను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం పరిశీలించారు. ఇప్పుడు కూడా కన్నెపల్లి వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నదని, పంపులు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయాలని సూచించారు.
వరంగల్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్‌లో తాగునీటి సంక్షోభాన్ని నివారించేందుకు వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలని, లేకపోతే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి శనివారం సందర్శించారు.
గోదావరి జలాలు పెద్ద మొత్తంలో దిగువకు ప్రవహిస్తున్నా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాటిని వినియోగించుకోవడంలో ప్రభు త్వం విఫలం అవుతున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల అవసరాలు తీ ర్చాలని కోరారు. జూన్ నుంచి ఇప్పటివరకు సుమారు 750 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలిశాయని, అందులో కనీసం 250 టీఎంసీలు ఎత్తిపోసినా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీరి, అసలు రాష్ర్టానికి కరువు ఛాయలే కనిపించేవి కావని ఆవేదన వ్యక్తంచేశారు.
పంప్‌హౌస్‌కు వెళ్లకుండా అడ్డగింత
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శనివారం ఉద యం హైదరాబాద్ నుంచి హనుమకొండలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటికి చేరుకొని అక్కడి నుంచి మేడిగడ్డకు బయలుదేరింది. గేట్లన్నీ ఎత్తి ఉండటంతో దిగువకు వృథాగా పోతున్న గోదావరి జలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడినుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి పంప్‌హౌస్ సమీపంలోని గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
పరిశీలించేందుకు అనుమతి నిరాకరించడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ బృందానికి పోలీసులకు నడుమ వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నీటిపారుదల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ‘కేసీఆర్ శ్రమకోర్చి ప్రపంచంలోనే అతిపెద్ద పంపులను తెప్పించి ఇక్కడ(కన్నెపల్లిలో) బిగించారు.
ఇప్పుడా పంప్‌హౌస్‌ను చూడనివ్వటం లేదు. కారణం ఏమిటీ? అసలు పంపులున్నాయా? లేవా? రేవంత్‌రెడ్డి వాటిని కూడా అమ్మేసిండా? అందుకే వాటిని చూడనివ్వటం లేదా?’ అని నీటి పారుదల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలకు నీళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ఎర్రబెల్లి నిలదీశారు. పైనుంచి వచ్చే ఆదేశాలనే తాము పాటిస్తామని అధికారులు బదులివ్వడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ బృందం నిరసనకు దిగింది.
పంప్‌హౌస్ ఎదుట బైఠాయించి నిరసన
పోలీసుల తీరుకు నిరసనగా పంప్‌హౌస్ గేటు ఎదుట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బైఠాయించి నిరసన తెలిపారు. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ‘గోదావరిలో నీళ్లుండీ ఇవ్వలేని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి’, ‘దిగిపో..దిగిపో.. రేవంత్‌రెడ్డి దిగిపో..’ చేతగాని సీఎం డౌన్..డౌన్, ‘అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి డౌన్.. డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాటిని వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే ప్రజలకు ఇబ్బందులు..
- మలాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందుచూపు లేని విధానాలతో ప్రజలు సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురొంటున్నారని మలాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించి, స్థానిక నాయకులు, సంబంధిత ఇంజినీర్లను కలిసి నీటి లభ్యత, బ్యారేజీ పరిస్థితులపై వివరాలు తెలుసుకునేందుకు వచ్చామని ఆయన వెల్లడించారు. గోదావరి నుంచి రోజుకు రెండు టీఎంసీల నీ టిని తరలించే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారని, అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు పేరొస్తుందనే సర్కార్ నీళ్లు ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌లో ప్రజల తాగునీటిని సరఫరా చేయడంలో జలమండలి తాగునీటిని విఫలమైందని ధ్వజమెత్తారు. మూడు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తున్నారని, ఎందుకు ఇలా అవుతుందని జలమండలి అధికారులను నిలదీస్తే సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయనడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ముందస్తుగా జలాశయాల్లో తగినంత నీటిని నిల్వ చేసుకొంటే హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోనూ ఇలాంటి కరువు పరిస్థితిని వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో తాగునీటి సమస్యను కొంతమేరకైనా నివారించవచ్చని ఆయన సూచించారు.
రాజకీయ కక్షతోనే పకనపెడుతున్నారు
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించడం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి విమర్శించారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడిచి పెడుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఒడిసి పట్టుకొని నీటి వనరులను వినియోగించుకుంటుందని ఆయన ఆరోపించారు. నీటి లభ్యత ఉన్నప్పుడే ఎత్తిపోతల పథకాలను వినియోగిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ట్యాంకర్లతో నీటి సరఫరా పెరుగడం జలమండలి వైఫల్యమేనని మండిపడ్డారు. జూన్‌లో 8.8, జూలైలో 140, ఆగస్టులో 399, సెప్టెంబర్‌లో 140, అక్టోబర్‌లో 55 కలిపి సుమారు 750 టీఎంసీలు దిగువకు పోయాయని గణాంకాలతో వివరించారు.
స మ్మక బరాజ్ నుంచి కూడా 1, 446 టీఎంసీలు దిగువకు వెళ్లినట్టు తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడంలో జలమండలి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరానికి అవసరమైన నీటి వనరులను ముందుగానే సమకూర్చుకుని, భవిష్యత్తులో జనాభా పెరిగినా ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రాజెక్టును పకనపెట్టకుండా, భద్రత అంశాలను పరిషరించి నీటిని వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నీటిని ఎత్తిపోయటానికి విద్యుత్ ఖర్చు అవుతుందని భావించొద్దని రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని సుధీర్‌రెడ్డి గుర్తుచేశారు.
కాళేశ్వరం నీటిని వినియోగించుకోవాలి
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సాగు, తాగునీరు అందించలేం.. రైతులు పంటలు వెయ్యొద్దని సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. హైదరాబాద్ నీటి సంక్షోభాన్ని పరిషరించే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా కనీసం ఇప్పటికైనా గోదావరి జలాలను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ ప్రజలకు నీరు, విద్యుత్ సహా అవసరమైన సేవలు అందేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డి తెలివి తకువ ఆలోచనలతో రాష్ట్రాన్ని ఎడారిలా మార్చారని విమర్శించారు. మేడిగడ్డ బరాజ్‌లో ఒక్క పిల్లర్ కొద్దిగా కుంగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేండ్ల నుంచి పిరికెడు సిమెంట్ వెయ్యకుండా కేసీఆర్‌ను బదనాం చేసే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. తాగడానికి నీళ్లు లేకపోతే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అని ప్రశ్నించారు. ‘సాగునీరందించక వ్యవసాయరంగాన్ని కుదేలు చేశావు? తాగునీరందించక హైదరాబాద్‌వాసులను అరిగోస పెడుతున్నావు.
రేవంత్ నీకు రైతులు, ప్రజల పాపం తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం’ ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల నుంచి 1,300 టీఎంసీల నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేశారని, ఆ నీళ్లను ఎత్తిపోస్తే ఇవాళ కరువు వచ్చేది కాదని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంటే కేసీఆర్ మాత్రం 24గంటల కరెంట్, తాగు, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, పెంచిన పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలు ఆపకుండా విజయవంతంగా అమలు చేశారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క, సారక్క బరాజ్‌ల నుంచి నీటిని ఒడిసి పట్టి సాగునీటితోపాటు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

