గ్రావిటీతో నీళ్లా.. నిరూపిస్తే రాజీనామా?
మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓపెన్ చాలెంజ్ విసిరారు. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని కాంగ్రెస్ సర్కార్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రిజైన్ చేస్తా రా? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సవాల్ చేశారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని ప్రభుత్వం అబద్ధాలు చెప్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
- లేదంటే మీరు చేస్తారా ఉత్తమ్?
- సర్కార్‌కు హరీశ్ ఓపెన్ చాలెంజ్
- తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తామని అబద్ధాలు చెప్తున్నరు
- దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల ఎత్తిపోతలపై శ్వేతపత్రం ఇవ్వాలి
- మేడిగడ్డ మరమ్మతులు చేపట్టి కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తండి
- బీఆర్ఎస్ల్పీ నేత హరీశ్ డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓపెన్ చాలెంజ్ విసిరారు. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని కాంగ్రెస్ సర్కార్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రిజైన్ చేస్తా రా? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సవాల్ చేశారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని ప్రభుత్వం అబద్ధాలు చెప్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆ ప్రతిపాదనకు సంబంధించిన డీపీఆర్‌ను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం మాజీ ఎమ్మెల్యే బాల్క సు మన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గట్టు రామచందర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువుకు కాంగ్రెస్ వైఫల్యమే కారణమని, ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని పునరుద్ఘాటించారు. నీళ్లు కొనలేమని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, అందుబాటు లో ఉన్న నీటిని ఎందుకు ఎత్తిపోసి రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నీటికి ఎందుకు నిర్లక్ష్యంగా కిందికి వదిలేశారని నిలదీశారు.
ఏపీలో క్రాప్‌హాలిడే ఎందుకు లేదు?
ఇక్కడి ప్రభుత్వం అప్పనంగా వదిలేసిన నీళ్లను ఏపీ సర్కార్ ఒడిసిపట్టి పంటలు పండించుకుంటున్నదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఏపీలోని పట్టిసీమ లిప్ట్ వంద రోజులు నీళ్లు ఎట్లా ఎత్తింది? దానిపై ఉన్న దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎందుకు ఎత్తలేదు? అని ప్రశ్నించారు. 33శాతం లోటు వర్షపాతం ఉన్న ఏపీలో క్రాప్‌హాలిడే ఎందుకు లేదు.. 17శాతం మాత్రమే లోటు వర్షపాతం నమోదైన తెలంగాణలో ఎందుకు ఉన్నది? అని నిలదీశారు. దేవాదులను సక్రమంగా నడిపి ఉంటే వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాలోని కొంతభాగం సస్యశ్యామలంగా మారేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉన్నప్పుడు 24/7 ఎత్తిపోసి పంటలను కాపాడేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఐదు మోటర్లకు గాను రెండింటినే ఎందుకు నడుపుతున్నారని, 12 గంటలు ఆన్, 12గంటలు ఆఫ్ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు.
మేడిగడ్డకు మరమ్మతులు చేయండి
ప్రభుత్వం తక్షణమే మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టి, కన్నెపల్లి పంపుహౌస్ మోటర్లను నడిపి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తమ్మిడిహట్టి నుంచి నీటిని తీసుకొచ్చేందుకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నదని, అకడినుంచి సుందిళ్లకు నీటిని తరలించే ప్రతిపాదనలో ఆయకట్టు ఎంత ఉన్నదో వెల్లడించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఆ ఖర్చు రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు చేరే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని, అది ఆచరణసా ధ్యమో కాదో కాలమే నిర్ణయిస్తుందన్నారు.
పదేండ్లుగా కాంగ్రెస్ కాలయాపన
బీఆర్ఎస్ పార్టీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నదని, తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని మూడు లేఖల ద్వారా తేలిన తర్వాతే మేడిగడ్డకు వెళ్లాల్సి వచ్చిందని హరీశ్ చెప్పా రు. 2014లో అధికారంలోకి వచ్చిన 42 రో జుల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో అనేకమార్లు చర్చలు జరిపామని గుర్తుచేశారు. తొలి ఆరు నెలల్లో అర డజన్ మీటింగులు పెట్టామని, నాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ తో, బీజేపీ ప్రభుత్వం ఉంటే వెళ్లి అడిగామని ఎంత చెప్పినా 152 మీటర్లకు ఒప్పకోలేదని వివరించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 1054 రోజుల తర్వాత మొదటి మీ టింగ్‌కు వెళ్లారని విమర్శించారు. 2007లో ప్రారంభమైన ప్రాజెక్టు 2014 దాకా ఏం చేశారని, మూడు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నా 152 మీటర్లకు ఒప్పించలేదని, నాడు ఏడేండ్ల్లు, నేడు మూడేండ్లు కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తల దగ్గర కా కుండా తోక దగ్గర పనులు చేసి మొబిలైజ్ అ డ్వాన్సుల పేరిట బిల్లులు ఎత్తారని మండిపడ్డారు. తమకు రాజకీయాలు కాదని, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టంచేశారు.
గోదావరిలో నీళ్లు ఎత్తిపోసేందుకు లెవల్ లేదు ఎట్ల లిఫ్ట్ చేస్తమని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఇప్పుడు మాట్లాడుతున్నరు. లెవల్ ఉన్నప్పుడు కన్నెపల్లి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయలేదు? గడ్డి పీకారా? నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా రాజకీయ కారణాలతో మోటర్లు నడపడం లేదు. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు పనిచేశాయి? ఎన్ని మోటర్లతో ఎంత నీటిని ఎత్తిపోశారో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలి.
– హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

