Nirmal | నిర్మల్ పట్టణంలో విషాదం..గాలిపటాలు ఎగురవేస్తూ బాలుడి మృతి
Nirmal | నిర్మల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గాలిపటాల ఎగురవేత(Flying kites) ఓ బాలుడి ప్రాణాలను (Boy dies)బలితీసుకుంది.
నిర్మల్ : నిర్మల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గాలిపటాల ఎగురవేత(Flying kites) ఓ బాలుడి ప్రాణాలను (Boy dies)బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో గాలిపటాలను ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు స్లాబు పైనుంచి కిందపడి ఉబేజ్(14) అనే బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కాగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఉబేజ్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, గాలిపటాలు ఎగరవేసేటప్పుడు కింది జాగ్రతత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్లాస్టర్ చుట్టుకోవాలి
గాలిపటాలు ఎగురేయడంలో ఆనందం ఉంటుంది. దాంతో పాటు అజాగ్రత్తగా ఉంటే ఎనలేని దుఖఃమూ దరిచేరుతుంది. గాలిపటాలు ఎగురవేసే సమయంలో వేళ్లకు ప్లాస్టర్ వంటివి చుట్టూకోవాలి. దీని వల్ల మాంజా పూసిన దారం వల్ల చేతివేళ్లు తెగకుండా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం జరిగితే, గాయాన్ని శుభ్రంగా కడగాలి. రక్తస్రావం ఆగేందుకు బ్యాండేజితో కట్టేసి, సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా గాలిపటాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా మైదాన ప్రాంతాల్లో ఎగురవేయడమే మేలు.
మిద్దెలు ఎక్కక పోవడమే ఉత్తమం
గాలిపటాలు బాగా ఎత్తున ఎగరాలని చాలా మంది సమీపంలోని మిద్దెలు, ఎతైన గోడలపైకి ఎక్కుతారు. ఇలా ఎక్కి గాలిపటాలను వదిలే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడే అవకాశం ఉంది. ఒకవేళ కిందపడి దెబ్బలు తగిలిన చోట మసాజ్ చేయకూడదు. రక్తస్రావం ఉన్న చోట బ్యాండేజిని వదులుగా చుట్టాలి. గాయాలైన చోట పసుపు కూడా అద్దకూడదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి.
విద్యుత్ తీగలున్న చోటకు వద్దు
గాలి పటాలు ఎగురవేయడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ప్రధానంగా విద్యుత్లైన్లు తగిలిన దానిని కర్రలు, గడలతో లాగేందుకు ప్రయత్నం చేయరాదు. దీనివల్ల షార్ట్‌సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగనట్లయితే సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయలో తెలుపాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

