బయోలాజికల్-ఈ నుంచి న్యుమోనియా టీకా
హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఈ మరో ఘనత సాధించింది.
- పీసీవీ-14 టీకా వినియోగానికి డీసీజీఐ అనుమతులు
- స్ట్రెప్టోకోకస్ వైరస్ నుంచి చిన్నారులకు సమర్థంగా రక్షణ
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఈ మరో ఘనత సాధించింది. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన ‘14-వాలెంట్ పీడియాట్రిక్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్’ (పీసీవీ-14) వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతులు లభించినట్టు ఆ సంస్థ శుక్రవారం ప్రకటించింది. 6, 10, 14 వారాల వయసులో శిశువులకు ఈ టీకా ఇవ్వవచ్చని తెలిపింది. మన దేశంతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐదేండ్లలోపు వయసున్న ఎంతో మంది పిల్లల మరణాలకు కారణమవుతున్న స్ట్రెప్టోకోకస్ న్యుమోనియాను నిరోధించేందుకు పీసీవీ-14 టీకా ఉపయోగపడుతుందని పేర్కొన్నది. 14 రకాల స్ట్రెప్టోకోకస్ వైరస్ వేరియంట్లను ఎదుర్కోగలదని, మన దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న 22ఎఫ్, 33ఎఫ్ రకం స్ట్రెప్టోకోకస్ వైరస్ నుంచి సమర్థంగా రక్షణ కల్పిస్తుందని తెలిపింది. వ్యాక్సిన్‌కు అనుమతులు లభించడంపై బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్ల సంతోషం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

