సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
- రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు
- రెండు నెలలుగా విస్తరిస్తున్న టైఫాయిడ్
- కొత్త వేరియంట్ వస్తే తప్ప కరోనా భయం లేదు
- మీడియాతో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు తగ్గిన వెంటనే సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 2019లో మాదిరిగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1,184 డెంగ్యూ కేసులు నమోదు కాగా అందులో 516 కేసులు హైదరాబాద్‌లోనే వెలుగుచూశాయని వివరించారు. రెండు నెలలుగా టైఫాయిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉన్నదని, అన్ని ప్రభుత్వ దవాఖానల్లో తగిన మందులు ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ దవాఖానలు డెంగ్యూ చికిత్స విషయంలో ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకోవద్దని కోరారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. రాష్ట్రంలో ఆరు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, హైరిస్క్ గ్రూప్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గిందని, రానున్న రోజుల్లో సాధారణ ఫ్లూ మాదిరిగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే సీజనల్ ఫీవర్ క్యాటగిరీలోకి చేరిందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం కాంటాక్ట్ ట్రేసింగ్ అవసరం లేదని తెలిపారు. భవిష్యత్తులో బలమైన వేరియంట్ వస్తే తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యారోగ్యశాఖ సూచనలు
- ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి. దోమలు పెరగకుండా, ఇండ్లల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
- కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులను తప్పించుకొనేందుకు కాచి, చల్లార్చిన నీటినే తాగాలి.
- ఆహారం కలుషితం కాకుండా తాజాగా వండుకొని వేడి వేడి ఆహారం తీసుకోవాలి.
- రోడ్డు పక్కన దొరికే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.
- వర్షాల వేళ ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలి.
- తప్పకుండా మాస్క్ ధరించాలి. ఇది కొవిడ్‌తోపాటు అనేక సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
- వానల వల్ల రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రసవం తేదీ దగ్గరపడ్డ గర్భిణులు దవాఖానకు సమీపంలో ఉండాలి.

టైఫాయిడ్ ఎక్కువగా ఉన్న జిల్లాలు
ఆదిలాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, భూపాలపల్లి
- డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం – హైదరాబాద్
- టైఫాయిడ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లా – నిర్మల్ (918)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Seasonal Disease
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

