భార్య కుటుంబాన్ని కడతేర్చిన క్రిమినల్ ఎడిటర్!
బెంగళూరులో ఒక వ్యక్తి దారుణ మారణకాండకు పాల్పడ్డాడు. నిందితుడు ఇందుశేఖర్ ‘ఠాణా వరది’ (స్టేషన్ రిపోర్ట్) అనే స్థానిక కన్నడ-ఆంగ్ల క్రైమ్ వార్తల మాసపత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త. అతను క్యాబ్ డ్రైవర్‌గా కూడా పనిచేస్తున్నాడు.
- బెంగళూరులో మారణకాండ
- భార్య సహా అత్తింటివారు ఏడుగురి దారుణ హత్య
బెంగళూరు, నవంబర్ 6: బెంగళూరులో ఒక వ్యక్తి దారుణ మారణకాండకు పాల్పడ్డాడు. నిందితుడు ఇందుశేఖర్ ‘ఠాణా వరది’ (స్టేషన్ రిపోర్ట్) అనే స్థానిక కన్నడ-ఆంగ్ల క్రైమ్ వార్తల మాసపత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త. అతను క్యాబ్ డ్రైవర్‌గా కూడా పనిచేస్తున్నాడు. భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశాడు. మృతుల్లో ఏడేండ్ల బాలుడు కూడా ఉన్నాడు. రాజాజీనగర్‌కు చెందిన శేఖర్, అతని భార్య సునీతకు మధ్య తరచూ కుటుంబ కలహాలు జరిగేవి.
ఆమె అస్తమానం పుట్టింటికి వెళ్లడం, వారితోనే ఎక్కువ ఉండటం పట్ల శేఖర్ అసహనం వ్యక్తం చేసేవాడు. దీంతో పలుమార్లు కుటుంబ సభ్యులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ విభేదాలు సమసిపోలేదు. దీంతో సునీతతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హతమార్చాలని శేఖర్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సునీతను రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి నందిహిల్స్ సమీపంలో పడేశాడు. ఆమె ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి విహారయాత్రకు వెళ్లిందని ఇరుగుపొరుగును నమ్మించాడు. ఆ తర్వాతి రోజు ఇద్దరు బావమరుదులు శివకుమార్, శంకర్లను పార్టీ పేరుతో ఇంటికి ఆహ్వానించి హత్య చేశాడు. వారి భార్యలు దివ్య, నళిని, అత్త రూపావతి, శివకుమార్ ఏడేండ్ల పునీత్‌ను కూడా హతమార్చాడు. .
ఎలా బయటపడింది?
నళిని కన్పించడం లేదంటూ ఆమె తల్లి శ్రీరాంపుర పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో శేఖర్‌పై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, తానే ఏడు హత్యలను చేశానని అంగీకరించినట్టు సమాచారం.
ప్రస్తుతం ఏడేండ్ల బాలుడి మృతదేహం మాత్రమే నందిహిల్స్ సమీపంలో లభ్యం కాగా, మిగిలిన మృతదేహాల కోసం నందిహిల్స్ ప్రాంతాలతో పాటు, ఇతర ప్రదేశాల్లోనూ పోలీసులు, అటవీ సిబ్బంది గాలిస్తున్నారు. ఇన్ని హత్యలు ఒకేచోట జరిగినా స్థానికులు, ఇరుగుపొరుగువారికి ఎలా తెలియలేదనే అంశంపైనా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ హత్యల్లో నిందితుడి కుమార్తె పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల తరలింపునకు వాడిన కారును, హత్యలకు వినియోగించిన రోకలిబండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

