హైదరాబాద్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ): జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చడంలేదని ఆరోపించారు. ఓబీసీ కాలమ్ చేర్చడానికి ఇప్పటికైనా బీజేపీలోని బీసీ నేతలు కృషి చేయాలని, ప్రధాని మోదీని కలిసి ఒప్పించాలని కోరారు. లేదంటే చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.