బర్రెదూడ కోసం ఘర్షణ

- పరస్పర దాడుల్లో ఐదుగురికి తీవ్రగాయాలు
- 9 మందిపై హత్యాయత్నం కేసు
- నిజామాబాద్ జిల్లాలో ఘటన
నవీపేట, మే 1: బర్రెదూడ పోయిందంటూ తాగివచ్చి అల్లుడితో ఘర్షణకు దిగటం పరస్పర దాడులకు దారితీసింది. దాడిలో కత్తులు, కర్రలు ఉపయోగించడంతో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన ముగ్గురు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకిరాబాద్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. స్థానికులు, సీఐ గురునాథ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రెడ్డిపల్లి పోశెట్టి(పశువుల కాపరి) పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని తన బర్రెదూడ పోయిందంటూ తాగి వచ్చి అల్లుడు లక్ష్మణ్‌తో ఘర్షణకు దిగాడు. అక్కడే ఉన్న దూరపు బంధువు నారాయణ కలుగచేసుకొని మందలించాడు. దీంతో పోశెట్టి, నారాయణ వర్గీయులు పరస్పరం కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో గంగాధర్, నరేందర్, లింగన్న, నారాయణ, సుగన్నకు కత్తిపోట్లు కాగా, మరో ఇద్దరు పోశెట్టి, అనిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు సీఐ గురునాథ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

