పింఛన్ ఇప్పిస్తామని ఆస్తి కబ్జా

- అనాథ వృద్ధురాలిని నమ్మించిన బంధువు
- ఇల్లు, భూమి పట్టా చేసుకుని బయటకు గెంటివేత
కోనరావుపేట, జూన్ 7: పింఛన్ ఇప్పిస్తానంటూ అనాథ వృద్ధురాలి ఆస్తిని కబ్జా చేసుకొని, ఇంటి నుంచి గెంటేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో వెలుగుచూసింది. నిమ్మపల్లిలో మానుక నర్సవ్వ, రాజయ్య వృద్ధ దంపతులకు సంతానం లేదు. నాలుగేళ్ల క్రితం రాజయ్య అనారోగ్యంతో మృతిచెందగా, నర్సవ్వ ఇంట్లోనే ఒంటరిగానే కాలం వెల్లదీస్తున్నది. దీంతో బంధువైన మానుక శంకర్, అతని కొడుకు నరేశ్ కలిసి నర్సవ్వకు పింఛన్ ఇప్పిస్తామని నమ్మబలికి సంతకాలు తీసుకున్నారు. అధికారులతో కుమ్మకై ఇల్లుతోపాటు సర్వేనంబర్ 313లో రెండు ఎకరాల భూమిని తమ పేరిట పట్టా చేయించుకొన్నారు. కాగా, నర్సవ్వకు ఇటీవల చేతకాకపోవడంతో కొద్దిరోజులుగా కులస్థులు అన్నం పెడుతున్నారు. దీంతో ఆస్తి అమ్మి, వచ్చిన డబ్బులతో బతుకుదామని నర్సవ్వ భావించి కులస్థులను ఆశ్రయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నర్సవ్వ తన ఆస్తి గురించి శంకర్‌ను నిలదీయగా చితకబాది ఇంటి నుంచి గెంటేశాడు. బాధితురాలు న్యాయంకోసం పోలీసులను ఆశ్రయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

