కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన డిప్యూటీ స్పీకర్
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రతి పాన్ షాపు బెల్ట్ షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ షాపే అని వ్యాఖ్యానించారు. అక్రమ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై చైర్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ స్పందించారు. తప్పుడు ఆరోపణలు చేయొద్దని శ్రీధర్ బాబుకు డిప్యూటీ స్పీకర్ సూచించారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడా కూడా బెల్ట్ షాపు అనేది ఉండదు. హైదరాబాద్ మొత్తంలో ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండదు. జిల్లాల్లో కూడా ఎట్ల ఉంటది అంటే.. మంటల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఎక్కడో ఒక చోట, 10 కిలోమీటర్ల దూరంలో వైన్ షాపు ఉంటది. అక్కడికి వెళ్లి తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతారని చెప్పి.. అదేదో తెచ్చి గ్రామాల్లో పెడుతరు. అయితే గ్రామానికి, కిరణా షాపుల్లో, అక్కడ ఇక్కడ బెల్ట్ షాపులు ఉండవని స్పష్టం చేశారు. గతంలో ఎక్సైజ్ మంత్రిగా పని చేశాను.. తాను ఇక్కడ కూర్చొని చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

