Pawan Kalyan | కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్‌ను చేసేందుకు స్థానికులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డుమార్గంలో శనివారం ఉదయం ఆయన కొండగట్టుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నారు. ముందుగా హైదరాబాద్ శివారులోని తుర్కపల్లిలో పవన్ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
తుర్కపల్లి నుంచి బయల్దేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్ కల్యాణ్‌ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన వీరఖడ్గంతో ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయల్దేరి వచ్చారు.
ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు నిష్టతో ఈ దీక్షను పాటించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, గత ఏడాది ఎన్నికలకు ముందు ప్రచారం మొదలుపెట్టిన పవన్ కల్యాణ్.. తన వారాహి ప్రచార రథానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారాహి విజయయాత్రను నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!


