AP Bhavan | ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం.. తెలంగాణకు ఎంత కేటాయించారంటే..
AP Bhavan | ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ భవన్‌ను రెండుగా విభజిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకారం తెలపడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు 8.24 ఎకరాలు, ఏపీకి 11.53 ఎకరాలను కేటాయించింది.
AP Bhavan |
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పదేండ్ల తర్వాత ఏపీ భవన్ విభజనకు మోక్షం లభించింది. ఏపీ భవన్‌ను రెండుగా విభజిస్తూ కేంద్ర హోం శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకారం తెలపడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అశోక రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉండగా.. తెలంగాణకు 8.24 ఎకరాలు, ఏపీకి 11.53 ఎకరాలను కేటాయించింది.
ఏపీ భవన్‌లోని శబరి బ్లాక్‌లో 3 ఎకరాలు, పటౌడీ హౌస్‌లో 5.24 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది. ఏపీకి 5.78 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్‌లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే గోదావరి బ్లాక్‌లోని నర్సింగ్ హాస్టల్లో 3.35 ఎకరాలను, పటౌడీ హౌస్‌లో 2.39 ఎకరాలు ఏపీకి కేటాయించింది.ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AP
- AP Bhavan
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

