డ్రగ్స్ రవాణాను గుర్తించేందుకు ఆధునిక పరికరాలు : సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని, అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల రవాణాను గుర్తించేందుకు పోలీసు శాఖకు ఆధునిక పరికరాలను అందజేస్తామని సీఎస్ ప్రకటించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. మంగళవారం ఉదయం బీఆర్కే భవన్లో సీఎస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధక కమిటీ సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ పలు మార్లు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు పథకాన్ని నిలిపివేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పోలీస్ శాఖ, ఎక్సైజ్, ఆటవీ, గిరిజన సంక్షేమం, రెవెన్యూ శాఖలు కలిసి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం పై సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. మాదక ద్రవ్యాల వినియోగ నివారణ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం ప్రతీ మూడు నెలలకు ఒక సారి జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ప్రతీ జిల్లాతో పాటు పోలీస్ కమీషనరేట్ లలో మాదక ద్రవ్యాల నిరోధక సెల్‌లను ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని, పీడీ చట్టాన్ని కూడా విధిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవీ గుప్తా, సీఐడీ అదనపు డీజీ గోవింద్ సింగ్, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు జాయింట్ డైరెక్టర్ పీ అరవిందన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డైరెక్టర్ జనరల్ డీపీ నాయుడు, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు దక్షణాది రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఐజీ రాజేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

