మార్చి 4 నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వరకు 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్దాంతానుసారముగా, భగవద్రామానుజ సాంప్రదాయ సిద్దముగా బ్రహ్మోత్సవములు నిర్వహించుటకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.
స్వామి బాలాలయం నందు 4వ తేదీన ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనము, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14న ఉదయం 10 గంటలకు శ్రీ స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
మార్చి 11న ఉదయం 11 గంటలకు బాలాలయములో నిర్వహించే శ్రీ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు, టీటీడీ తరపున, పోచంపల్లి చేనేత సంఘం తరపున శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ వేడుకలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

