అలా వెళ్లి.. ఇలా వచ్చారు!
ఎస్సీ గురుకుల సొసైటీలో మళ్లీ డిప్యుటేషన్ల తంతు కొనసాగుతున్నది. ఇటీవల ఆ సొసైటీలో డిప్యూటేషన్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించినప్పటికీ అమాత్యుడి అండదండలతో ఇప్పుడు మళ్లీ అక్రమంగా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు స్పష్టమవుతున్నది. దీంతో నచ్చినవారికి నచ్చిన చోట పోస్టింగ్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అమాత్యుడి పేరిట ఓ ఉన్నతాధికారి ఈ అక్రమ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్టు సొసైటీ మొత్తం కోడై కూస్తున్నది.
- ఎస్సీ గురుకులంలో అక్రమంగా డిప్యుటేషన్లు
- అమాత్యుడి అండతో కొనసాగుతున్న తంతు
- ప్రమోషన్ల కోసం పోస్టుల వారీగా 2 డీపీసీలు
- సర్కార్ తీరుపై ఉపాధ్యాయుల మండిపాటు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో మళ్లీ డిప్యుటేషన్ల తంతు కొనసాగుతున్నది. ఇటీవల ఆ సొసైటీలో డిప్యూటేషన్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించినప్పటికీ అమాత్యుడి అండదండలతో ఇప్పుడు మళ్లీ అక్రమంగా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు స్పష్టమవుతున్నది. దీంతో నచ్చినవారికి నచ్చిన చోట పోస్టింగ్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అమాత్యుడి పేరిట ఓ ఉన్నతాధికారి ఈ అక్రమ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్టు సొసైటీ మొత్తం కోడై కూస్తున్నది.
ఆ అధికారి నియామకం, ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇవి సంబంధిత మంత్రి దృష్టికి వెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం సొసైటీ వర్గాల ఆరోపణలకు బలం చేకూర్చుతున్నది. ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రధాన కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా డిప్యుటేషన్లను గతంలోనే రద్దు చేశారు. ఈ విషయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఏప్రిల్‌లో స్వయంగా వెల్లడించడంతోపాటు 6 నెలల్లో సొసైటీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, ఒక్క అధికారి కూడా డిప్యుటేషన్‌పై లేకుండా చూస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు మళ్లీ యథేచ్ఛగా ఎక్కడికక్కడ డిప్యుటేషన్లు కల్పిస్తున్నారు.
వాస్తవానికి అనారోగ్య కారణాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన అవసరాల నేపథ్యంలోనే అధికారులకు డిప్యుటేషన్లను కల్పిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా ఇటీవల పలువురు సిబ్బందికి ఇష్టారీతిన డిప్యుటేషన్లను కల్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు సొసైటీ ప్రధాన కార్యాలయంలో డిప్యుటేషన్‌పై సుదీర్ఘకాలంపాటు కొనసాగి, తదనంతరం ఉద్యోగుల ఒత్తిడి వల్ల ఖమ్మం జిల్లాకు వెళ్లిపోయిన ప్రిన్సిపాల్‌నే మళ్లీ డిప్యుటేషన్‌పై వీఎం (విక్టోరియా మెమోరియల్) హోమ్‌కు తీసుకొచ్చారు.
ఇదేవిధంగా ఏండ్లపాటు సొసైటీ ప్రధాన కార్యాలయంలో తిష్టవేసిన ఖమ్మం జిల్లా వ్యక్తిని సైతం తిరిగి తీసుకువచ్చారు. పీజీటీకి చెందిన సదరు టీచర్‌కు గతంలో మాదిరిగా మళ్లీ కీలక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇలా ఇప్పటివరకు ప్రధాన కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 మందికి డిప్యుటేషన్లను కల్పించినట్టు సొసైటీ వర్గాలు చెప్తున్నాయి. స్పౌజ్, అనారోగ్య కారణాల రీత్యా అనేక మంది ఉద్యోగులు డిప్యుటేషన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారందరినీ పక్కనపెట్టి ఎలాంటి కారణాలు లేకుండా కొందరికే అవకాశం కల్పించడం గమనార్హం. దీని వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండు డీపీసీల ఏర్పాటు
ప్రమోషన్లకు ఆ ఉన్నతాధికారి మొదటి నుంచే అనేక కొర్రీలు పెడుతుండటంతో 8 నెలలుగా ఈ ప్రక్రియ ముందుకుసాగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రమోషన్ల పక్రియకు మరో మెలిక పెట్టారు. గురుకుల సొసైటీకి సంబంధించి 2 డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్రబోయి ఉత్తర్వులు జారీశారు. సంయుక్త కార్యదర్శి పోస్టుల భర్తీ కోసం సొసైటీ సెక్రటరీ కన్వీనర్‌గా, ఎస్సీ, బీసీ అభివృద్ధి శాఖల కమిషనర్లు మెంబర్లుగా ఓ కమిటీని నియమించారు. డిప్యూటీ సెక్రటరీ, జోనల ఆఫీసర్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టుల భర్తీ కోసం ఏర్పాటైన డీపీసీకి సెక్రటరీ కన్వీనర్‌గా, ఎస్సీ, బీసీ శాఖల ఏడీలు, స్కూల్ ఎడ్యుకేషన్ జేడీలు మెంబర్లుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలు రెండేండ్లపాటు కొనసాగనున్నాయి. ప్రమోషన్ల ప్రక్రియను అడ్డుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మళ్లీ కమిటీలను ఏర్పాటు చేయడంపై సొసైటీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అనేక పోస్టులు ఖాళీ
ప్రమోషన్ల ప్రక్రియ సాకుతో సొసైటీ ఉన్నతాధికారులు బదిలీలను సైతం అటకెక్కించారు. ప్రస్తుతం సొసైటీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అనేక కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, జోనల్ ఆఫీసర్ పోస్టులతోపాటు దాదాపు 150 ప్రిన్సిపాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఈ పోస్టుల్లోకి కొందరు సొసైటీ ఉన్నతాధికారులు తమకు నచ్చిన వారిని డిప్యుటేషన్లపై తీసుకొచ్చి అడ్డదారిలో కీలక బాధ్యతలు అప్పగించారు. సీనియారిటీతో సంబంధం లేకుండా సొసైటీ ప్రధాన కార్యాలయంలో అక్రమంగా ఏండ్ల నుంచి తిష్టవేసిన వారితో ఈ పోస్టులు భర్తీ చేశారు. 23 మంది గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లకు గ్రేడ్-1 ప్రమోషన్ కల్పించారు. సొసైటీలో ఖాళీగా ఉన్న 3 డిప్యూటీ సెక్రటరీ (డీఎస్) పోస్టులను ఇటీవల సీనియర్ జోనల్ ఆఫీసర్లకు (జడ్వో) ప్రమోషన్ కల్పించడం ద్వారా భర్తీ చేశారు. సీనియర్ గ్రేడ్-1 ప్రిన్సిపాళ్లకు జోనల్ ఆఫీసర్లుగా ప్రమోషన్లు కల్పించే పక్రియ చేపట్టినప్పటికీ ప్రధాన కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి తీరు వల్ల ఆ ఫైలు పదే పదే వెనక్కి వస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

