NRI | కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆస్ట్రేలియాలో సర్వ మత ప్రార్థనలు
NRI | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పద్నాలుగు సంవత్సరాల క్రితం కేసీఆర్(KCR) చేపట్టిన ‘దీక్ష’ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియా(Australia)లోని మెల్బోర్న్, సిడ్నీ , బ్రిస్బేన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష దివస్(Deeksh divas)ను ఘనంగా నిర్వహించారు. అలాగే గాయపడిన కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
ఆస్ట్రేలియా : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పద్నాలుగు సంవత్సరాల క్రితం కేసీఆర్(KCR) చేపట్టిన ‘దీక్ష’ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియా(Australia)లోని మెల్బోర్న్, సిడ్నీ , బ్రిస్బేన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష దివస్(Deeksh divas)ను ఘనంగా నిర్వహించారు. అలాగే గాయపడిన కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ దీక్ష సమయంలో చేసిన త్యాగాలను, రాష్ట్రం సిద్ధించిన తరువాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి, ప్రవేశ పెట్టిన పథకాలు ఎంతో గొప్పవన్నారు.
తెలంగాణ కలను సాకారం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని తన భుజస్కందాలపై వేసుకొని మునుపెన్నడూ ఎరుగని విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన కేసీఆర్ కృషిని, పట్టుదలను ప్రశంసించారు. దేశ చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిరాం ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్, విశ్వామిత్ర, ఉదయ్ రెడ్డి, వేణు, సాయి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

