హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, కోట్లాది మంది ఓట్లు తొలగించి ఓట్ల చోరీకి బాధ్యులైన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో బుధవారం బషీర్‌బాగ్ నుంచి నిజాంకాలేజీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు ప్రతి పౌరుడి హకు అని, ఆ హకును కాపాడాల్సిన బాధ్యత గల ఎన్నికల సంఘం విస్మరించిందని మండిపడ్డారు.