Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Lawyer Suicide | పండగ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తనను ఎవరో వెంబడిస్తూ, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఓ యువ న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Lawyer Suicide | పండగ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తనను ఎవరో వెంబడిస్తూ, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఓ యువ న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడ్డారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే వి.వెంకటాయపాలెంకు చెందిన తొలుపునూరి గణేశ్ (27) గత ఏడాది కాలంగా ఖమ్మం కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి తన అన్న సాయితేజతో కలిసి ముదిగొండ మండలం పెద్దమండవలోని అమ్మమ్మ పద్మావతి ఇంటికి వెళ్లాడు. పండగ సందర్భంగా మంగళవారం అమ్మమ్మ పద్మావతి, సాయితేజ గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి గణేశ్ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. అది చూసి ఒక్కసారిగా వారు షాక్‌కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కాగా, గత నాలుగు రోజులుగా ఎవరో తనను వెంబడిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని గణేశ్ చెప్పినట్లు అతని తండ్రి దానయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని కూడా గణేశ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆరోపించాడు. ఈ కారణంగా మనస్తాపానికి గురైన కుమారుడికి కొంత మార్పు కల్పించాలనే ఉద్దేశంతో అమ్మమ్మ ఇంటికి పంపించామని, ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుందని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.
తండ్రి దానయ్య ఫిర్యాదు మేరకు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గణేశ్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఆయనను ఎవరు వెంబడించారు? ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తులు ఎవరనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

