రామన్నపేట అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఔట్.. ప్రజాసమస్యను అక్షరబద్ధం చేసిన నమస్తే తెలంగాణ
రామన్నపేటలో ఏర్పాటు చేయాలనుకున్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. దానిస్థానంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
- స్థానికుల నుంచి వ్యతిరేకత.. ఉద్యమంతో వెనక్కి తగ్గిన అదానీ
- లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంస్థ
యాదాద్రి భువనగిరి, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : రామన్నపేటలో ఏర్పాటు చేయాలనుకున్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. దానిస్థానంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. శనివారం రాత్రి యాదాద్రి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని తెలిపారు. రామన్నపేటలో డ్రైపోర్టు పేరుతో రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ భావించింది.
దీన్ని రామన్నపేటతోపాటు చుట్టుపక్కల గ్రా మాల ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా సమస్యను నమస్తే తెలంగాణ అక్షరబద్ధం చేసింది. నిత్యం కథనాలు ప్రచురించి అక్షర కవాతుగా నిలిచింది. కేటీఆర్‌తోపాటు అనేక మంది ప్రముఖులు స్పందించేలా చేసింది. అదానీ తమ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో రామన్నపేటతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో అండగా నిలిచిన నమస్తే తెలంగాణ దినపత్రికకు రామన్నపేటవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

