హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): బిగ్‌బాస్ సీజన్ 5 ముగిసింది. వీజే సన్నీ విజేతగా నిలిచారు. ట్రోఫీతోపాటు 50 లక్షల నగదు బహుమతి, సువర్ణభూమి తరఫున రూ.25 లక్షల ప్లాట్, టీవీఎస్ అపాచీ బైక్ సొంతం చేసుకొన్నారు. నటుడు షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్‌గా నిలిచారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఆదివారం అట్టహాసంగా జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ తారలు సందడిచేశారు. వీడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన సన్నీ అసలు పేరు అరుణ్‌రెడ్డి. కల్యాణ వైభోగం సీరియల్‌తో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. సీజన్-5 మొత్తం 105 రోజులుసాగింది. 19మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు.