Accident | కూలీల ఆటోను ఢీ కొట్టిన కారు .. చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
Accident | హనుమకొండ జిల్లా(Hanuma Konda District) పరకాల పట్టణ శివారు భూపాలపల్లి రోడ్డులోని చలివాగు బ్రిడ్జి వద్ద బుధవారం వ్యవసాయ కూలీలు(Agriculture Labours), ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
పరకాల(హనుమకొండ) : హనుమకొండ జిల్లా(Hanuma Konda District) పరకాల పట్టణ శివారు భూపాలపల్లి రోడ్డులోని చలివాగు బ్రిడ్జి వద్ద బుధవారం వ్యవసాయ కూలీలు(Agriculture Labours), ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామానికి మిర్చి ఏరేందుకు వెళ్తున్నారు. పరకాల పట్టణం దాటి చలివాగు బ్రిడ్జి సమీపిస్తుండగా భూపాలపల్లి నుంచి పరకాలకు వస్తున్న కారు(Car) అతి వేగంగా వచ్చి ఆటో(Auto)ను ఢీ కొట్టి రోడ్డు కిందకు దూసుకుపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యవసాయ కూలీలు రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోయారు.
ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మొగ్గం సమ్మక్క, కొంగరి చేరాలు, దుబాసి కోమల, దుబాసి సూరమ్మ, పసుల భిక్షపతి, కొంగరి లక్ష్మి, నాలికి స్వరూప, సిలివేరు కొమురమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటినా పరకాలలోని సివిల్ ఆస్పత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతున్న వారిలో కొంగరి చేరాలు (57), దుబాసి కోమల(56) అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా, సిలివేరు కొమురమ్మ పరిస్థితి విషమంగా ఉంది ఈమెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

