జగిత్యాల : రెవెన్యూ విభాగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో జగిత్యాల పురపాలక కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. సోదాల సందర్భంగా అధికారులు కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మ్యుటేషన్లు, వసూళ్లపై కార్యాలయ సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.