Peddapalli | పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి
Peddapalli | పెళ్లి ఊరేగింపు(Wedding procession) సందర్భంగా డ్యాన్స్(Dance) చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్ప కూలి పోయాడు.
పెద్దపల్లి : పెళ్లి ఊరేగింపు(Wedding procession) సందర్భంగా డ్యాన్స్(Dance) చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్ప కూలి పోయాడు. గమనించిన స్థానికులు దవాఖానకు తరలించినా అప్పటికే మృత్యువాతపడ్డాడు. పెద్దపల్లి (Peddapalli) జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంగనర్ మండలం తీగలగుట్టపల్లికి చెందిన విజయ్‌కుమార్(33) పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురంలోని స్నేహితుడి పెండ్లి విందు వేడుకలో పాల్గొనడానికి ఆదివారం సాయంత్రం వచ్చాడు.
విందు జరిగిన అనంతరం ఇదే మండలంలోని కొలనూర్‌లో విజయ్‌కుమార్ మిత్రుడికి తెలిసిన స్నేహితుడి పెళ్లి బరాత్ రాత్రి జరుగుతుండగా మిత్రుడి విజ్ఞప్తి మేరకు ఆ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు.
ఇందులో గంటల తరబడి డ్యాన్స్ చేస్తుండగా అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొత్కపల్లి ఎస్ఐ అశోక్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో షాక్.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్!
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
Rajinikanth | రూ.600 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. 40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
Water Wastage | నీళ్లు వృథా చేసే ట్యాంకర్లకు 5 వేలు జరిమానా.. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు.. జలమండలి ఎండీ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

