తాళ్లతో బంధించి.. ఒంటిపై వేడి నీళ్లు పోసి
కరీంనగర్లో గురువారం దారుణం జరిగింది. ఓ గృహిణి భర్తను తాళ్లతో కట్టి కారంపొడి, వేడి నీళ్లు ఒం టిపై పోసి రోకలి బండతో బాది దారుణంగా హతమార్చింది. కన్నతల్లి ఎదుటే ఈ కిరాతకానికి ఒడిగట్టింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
- భర్తను దారుణంగా హతమార్చిన భార్య
- కన్నతల్లి ఎదుటే కిరాతకం
రాంనగర్, మార్చి 28: కరీంనగర్లో గురువారం దారుణం జరిగింది. ఓ గృహిణి భర్తను తాళ్లతో కట్టి కారంపొడి, వేడి నీళ్లు ఒంటిపై పోసి రోకలి బండతో బాది దారుణంగా హతమార్చింది. కన్నతల్లి ఎదుటే ఈ కిరాతకానికి ఒడిగట్టింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన తోట హేమంత్‌కు రోహితితో 2012లో వివాహం జరిగింది. హేమంత్ (39) పెట్రోల్ బంక్‌లో పనిచేసి కొంతకాలం క్రితం మానేశాడు. రోహితి ప్రభుత్వ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిలో పేషెంట్ కేర్‌గా పనిచేస్తున్నది. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
గురువారం రోహిణి ఓ ఇద్దరితో కలిసి ఇంటికి వచ్చింది. తలుపులు పెట్టి హేమంత్‌ను ఇంట్లో తాళ్ల తో కట్టేశారు. కారం పొడి పోసి చితకబాదారు. కొంతసేపటి తర్వాత ఆ ఇద్దరు వెళ్లిపోగా రోహితి వేడి నీళ్లు ఒంటిపై పోసి రోకలి బండతో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. మర్మాంగంపై గాయాలు కావడంతో స్పృహ కోల్పోయాడు. చికి త్స కోసం అంబులెన్సులో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. తల్లి విమల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

