కరెంట్ షాక్‌ల కలవరం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో విద్యుత్ శాఖలో వరుస ప్రమాదాలు కలవరం పెడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో లేక క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపమో తెలియదు కానీ, లైన్మెన్ల జీవితాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి.
- కుత్బుల్లాపూర్ పరిధిలో వరుస ప్రమాదాలు
దుండిగల్, ఏప్రిల్ 29: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో విద్యుత్ శాఖలో వరుస ప్రమాదాలు కలవరం పెడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో లేక క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపమో తెలియదు కానీ, లైన్మెన్ల జీవితాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలో ఇద్దరు లైన్మెన్లు విద్యుత్ షాక్‌కు గురికావడం..అందులో ఒకరు చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
బుధవారం జీడిమెట్ల విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని డి.పోచంపల్లి(దొమ్మర పోచంపల్లి) సెక్షన్లో ఓ ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతు పనులు చేస్తుండగా, లైన్మెన్ నాగబాబు ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
సరిగ్గా పదిరోజుల కిందట ఏప్రిల్ 20న బహదూర్‌పల్లిలో ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. లైన్మెన్ శ్రీనివాస్‌రావు ట్రాన్స్ఫార్మర్పై పని చేస్తుండగా, కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు జరుగుతున్నప్పుడు సంబంధిత ఏఈ పర్యవేక్షణ ఉండడం లేదని, లైన్ క్లియరెన్స్(ఎల్సీ) ఇచ్చే విషయంలో సమన్వయ లోపం లైన్లమెన్ల ప్రాణాల మీదకు తెస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

