78వ బ్యాచ్ నుంచి 151 ఐపీఎస్‌లు
హైదరాబాద్‌లోని సర్దార్ వ ల్లభ్భాయ్ జాతీయ పోలీసు అకాడమీ నుంచి 78వ బ్యాచ్ ఐపీఎస్‌లలో 151 మంది మొదటిదశ శిక్షణను పూర్తి చేసుకున్నట్టు డైరెక్టర్ సుజిత్ పాండే తెలిపారు. పోలీసు అకాడమీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 78వ బ్యాచ్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈ నెల 17న జరుగనున్నదని,
- 17న పాసింగ్ ఔట్ పరేడ్
- రాష్ర్టానికి కేటాయించింది ఇద్దరినే
- ఇక్కడి నలుగురు ఇతర రాష్ర్టాలకు..
- అకాడమీ డైరెక్టర్ సుజిత్ పాండే
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని సర్దార్ వ ల్లభ్భాయ్ జాతీయ పోలీసు అకాడమీ నుంచి 78వ బ్యాచ్ ఐపీఎస్‌లలో 151 మంది మొదటిదశ శిక్షణను పూర్తి చేసుకున్నట్టు డైరెక్టర్ సుజిత్ పాండే తెలిపారు. పోలీసు అకాడమీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 78వ బ్యాచ్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈ నెల 17న జరుగనున్నదని, దీనికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. శిక్షణ పొందిన అధికారుల్లో 135 మంది ఐపీఎస్‌లు కాగా, మరో 16 మంది నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. ఈ బ్యాచ్‌లో 37 మంది మహిళా అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. కాగా, ఈ సారి తెలంగాణ కు కేంద్రం మొండిచేయి చూపినట్టు తెలుస్తున్నది.
78వ బ్యాచ్ నుంచి కేవలం ఇద్దరిని మాత్రమే తెలంగాణకు కేటాయించారు. వారిలో రాష్ర్టానికే చెందిన ఎన్ చేతనారెడ్డి, రాజస్థాన్‌కు చెందిన హర్ష్ దబారియా ఉ న్నారు. కాగా, తెలంగాణకు చెందిన నలుగురు ఇతర రాష్ర్టాల క్యాడర్‌కు వెళ్లారు. వారిలో కే అర్పిత ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు, చౌహాన్ రాజ్‌కుమార్ రాజస్థాన్‌కు, మేరుగు కౌశిక్, ధీరజ్‌రెడ్డిని మహారాష్ట్ర క్యాడర్‌కు కేటాయించారు. ఏపీ క్యాడర్‌కు మాత్రం 8 మందిని కేటాయించారు. మొ దటి దశ శిక్షణలో వివిధ విభాగాల్లో ప్రతిభచూపిన ట్రైనీలను డైరెక్టర్ సుజిత్పాండే అభినందించారు. కాగా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంపై విచారణ జరుగుతున్నని అకాడమీ డైరెక్టర్ సుజిత్పాండే తెలిపారు. ట్రైనీలకు నైతిక విలువలతో శిక్షణను అందిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

