హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 3801 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 2046 మంది బాధితులు తాజాగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38023 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 88,867 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీలో తాజాగా 1570 కరోనా కేసులు నమోదు అయ్యాయి.