ఉచిత అన్నదానానికి మూడేండ్లు

- బోధన్ ప్రభుత్వ దవాఖానలో విజయవంతంగా నిత్యాన్నదానం
- రోగులు, సహాయకుల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంకల్పం
బోధన్, ఏప్రిల్ 25: ఒక రోజో, రెండు రోజులో కాదు.. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ దవాఖానలో రోగులు, వారి బంధువులు, సహాయకులకు నిరంతరాయంగా జరుగుతున్న అన్నదానానికి శనివారం నాటికి మూడేండ్లు పూర్తయ్యాయి. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహిస్తున్నారు. దవాఖానకు వచ్చే రోగుల బంధువులు, సహాయకులు ఆకలి తీర్చుకోవడం కోసం పడేపాట్లను గమనించిన కవిత.. మూడేండ్ల కిందట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2018 ఏప్రిల్ 24న ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడేండ్లు పూర్తిచేసుకుని ఆదివారం నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టడంతో దవాఖాన సిబ్బంది, రోగుల సహాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. లాక్‌డౌన్‌లోనూ, ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలోనూ కవిత తలపెట్టిన అన్నదాన కార్యక్రమం ఆగలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

