Stray dogs | మహబూబ్‌నగర్‌లో వీధి కుక్కలపై బుల్లెట్ల వర్షం.. భయాందోళనలో ప్రజలు
Stray dogs | మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లాలో వీధి కుక్కలను(Stray dogs) తుపాకులతో కాల్చి చంపడం (Shot with guns) స్థానికంగా కలకలం రేపింది.
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లాలో వీధి కుక్కలను(Stray dogs) తుపాకులతో కాల్చి చంపడం (Shot with guns) స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట్ మండలం పొన్నకల్ (Ponnakal) గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలో 20 వీధి కుక్కలను కాల్చి చంపారు. ఈ కుక్కలను తుపాకీతో కాల్చి చంపినట్లు తెలుస్తున్నది. తుపాకుల మోత వినిపించకుండా సైలెన్సర్ బిగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
గ్రామంలో ఉన్న కుక్కలన్నింటినీ చంపడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అసలు కాల్చింది ఎవరు? ఎందుకు తుపాకులతో కుక్కలను కాల్చారు అనేది మిస్టరీగా మారింది. కుక్కల కోసం తుపాకులు వినియోగించడం ఏంటని పోలీసులు సైతం విస్తుపోతున్నారు. తెల్లవారుజామున గ్రామంలో వీధి కుక్కలు రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమై ఎలా చనిపోయాయని ఆరా తీస్తే పక్కనే బుల్లెట్లు తగిలి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయం దావనంలో పాకడంతో గ్రామం మొత్తం నిర్ఘాంత పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అం దించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కుక్కలను చంపింది ఎవరు? ఎందుకు చంపారనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

