పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం
Palle Davakhana | ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాల్లోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే
హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాల్లోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి నిర్థారణ చేసి, చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్ అన్నట్లు, ప్రాథమిక వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది వైద్య ఆరోగ్యశాఖ. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,745 ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఉండగా, ఇందులో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయంచింది. ఈ పల్లె దవాఖానాల్లో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ జీవో నెంబర్ 1563 జారీ చేసింది. వీరి నియమకానికి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది.
పల్లె దవాఖానాల పని తీరు ఇలా..
రాష్ట్రంలో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా వైద్య ఆరోగ్యశాఖ మార్చుతోంది. అయితే ఇప్పటికే ఈ సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు, ఆశాలు రోగికి అవసరమైన మందులు అందజేస్తున్నారు. ఇప్పుడు వీటిని పల్లె దవాఖానాగా మార్చుతూ, వాటిల్లో 1,492 మంది వైద్యులను నియమిస్తుండటంతో, మరింత నాణ్యమైన సేవలు పల్లెల్లో అందనున్నాయి. పల్లె దవాఖానాల్లో అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని టీ డయాగ్నస్టిక్స్ కు పంపుతారు. అక్కడి నుండి వచ్చిన వ్యాధి నిర్ధారణ ఫలితాలను బట్టి వైద్యులు అవసరమైన చికిత్సను అందిస్తారు. ప్రాథమిక దశలోనే ఈ పల్లె దవాఖానాల ద్వారా వ్యాధి ముదరకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ వ్యాధి తీవ్రత ఉంటే అలాంటి వారిని పల్లె దవాఖానా వైద్యుడు సీహెచ్ సీ లేదా ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు.
3,206 సబ్ సెంటర్లలో ఇక నుండి వైద్యులు
రాష్ట్రంలోని 3,206 సబ్ సెంటర్లలో 1492 మంది వైద్యుల నియామకం చేయనుండగా, మరో 636 సబ్ సెంటర్లు పీహెచ్‌సీల పరిధిలోనే ఉన్నాయి. అంటే మొత్తంగా 3842 సబ్ సెంటర్లలో డాక్టర్ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇక నుండి పల్లె ప్రజలకు అనారోగ్యం వస్తే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పల్లెల వద్దకే వైద్య సేవలు అందించనున్నాయి. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యలకు మాత్రమే పెద్దాసుపత్రులకు వెళ్లడం తప్ప, పల్లెల సుస్తీని ఇక పల్లె దవాఖనాలే పొగొట్టనున్నాయి.
పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం
వైద్యుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
వైద్యుల నియామకంతో పల్లెల్లో పెరగనున్న ఆరోగ్య సేవలు ఆరోగ్య తెలంగాణ దిశగా వడి వడిగా అడుగులు. pic.twitter.com/NmIhnU1Ki5— Harish Rao Thanneeru (@trsharish) December 7, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

