Heart Surgery| 3 రోజుల శిశువుకు గుండె ఆపరేషన్.. కిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స
Heart Operation | సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో మూడు రోజుల శిశువుకు అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స చేసినట్టు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్‌కుమార్ ధర్మవరం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు.
Heart Surgery | బేగంపేట్ నవంబర్ 10: సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో మూడు రోజుల శిశువుకు అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స చేసినట్టు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్‌కుమార్ ధర్మవరం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన శిశువు గుండెకు రెండు రకాల సమస్యలు ఏర్పడ్డాయని చెప్పారు.
ఈ శిశువుకు ట్రాన్స్‌పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టెరీస్ (టీజీఏ) టోటల్ ఎనామలస్ పల్మనరీ వీనస్ కనెక్షన్ (టీఏపీవీసీ) అనే రెండు రకాల తీవ్రమైన సమస్యలు గుండెలో ఏర్పడ్డాయని తెలిపారు. ఇలా రెండు రకాల సమస్యలు ఒకరిలోనే ఉండటం ప్రపంచ వైద్య చరిత్రలో మొదటిసారి అని అన్నారు. టీఏపీవీసీ సమస్యకు సంబంధించి ఊపిరితిత్తుల రక్తనాళాన్ని తీసి సరైన చోట పెట్టామని, మూడు రోజుల శిశువుకు ఇలాంటి చికిత్స చేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- heart
- heart surgery
- Hyderabad
- KIMS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

