జిల్లాకు కోటి రూపాయలు

- పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి నిధులు విడుదల
- హైదరాబాద్ మినహా జిల్లాలకు రూ.32 కోట్లు
- నిధులు ఖర్చు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు..
- సీఎం కేసీఆర్ అదేశాలతో ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి పనులకోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు రూ.32 కోట్లు విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రారంభంకానున్న నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్‌లో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున నిధులను విడుదల చేస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీచేశారు. క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ (సీబీఎఫ్) కింద విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులను వినియోగించే అధికారాన్ని కలెక్టర్‌కు ఇచ్చారు. ఈ నెల 13న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై జరిగిన అదనపు కలెక్టర్ల సమావేశంలో ఒక్కో అదనపు కలెక్టర్ పరిధిలో అసంపూర్తి పనుల కోసం రూ.25 లక్షల నిధులు (మొత్తం రూ.8 కోట్లు) విడుదల చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారుల వద్ద రూ.40 కోట్ల్లు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

