బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరికలు

మహబూబ్‌నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర స్టడీ సర్కిల్ కన్వీనర్ పాలాది రాంమోహన్, 150 మందితో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండుడాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీలు దేశానికి చేసిందేమీ లేదన్నారు.
టీఆర్ఎస్లో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు కొంచెం కొంచెం పెంచుకుంటూ ప్రజలపై భారం వేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్ అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
జడ్చర్లలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతనే సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బీటీ రోడ్లు వేయించి సెంటర్ లైటింగ్ తో డివైడర్లు నిర్మాణలు చేపట్టామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

