Minister Jagadish Reddy | తెలంగాణలో గులాబీ ప్రభంజనం ఖాయం : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy | తెలంగాణలో గులాబీ ప్రభంజనం ఖాయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
సూర్యాపేట : తెలంగాణలో గులాబీ ప్రభంజనం ఖాయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండలో క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. కేసీఆర్ (KCR) హ్యట్రిక్ కొట్టడం పక్కా. విశ్వాసంతో చెబుతున్న. విజయం బీఆర్ఎస్దే’ నని వెల్లడించారు. రాబోయే రెండు రోజులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని, సోషల్ మీడియాలో మాయగాళ్ల ఫేక్ ప్రచారాల(Fake Campaign) ను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రజలు బీఆర్ఎస్ ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనీ, ఎక్కడికి వెళ్లినా ప్రచారంలో లభిస్తున్న ఘనమైన ఆదరణే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మడంలేదన్నారు. రైతు బంధు కాంగ్రెస్ వల్లే ఆగిపోయిందని ప్రజలు విశ్వసిస్తున్నారని వివరించారు. ప్రచారంలో కాంగ్రెస్ దొంగ జపాలను ప్రజలకు వివరించామని ఆయన వెల్లడించారు. 2014 కు ముందు, తరువాత పరిస్థితి బేరీజు వేసుకుంటే కేసీఆరే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

